- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hero Vida VXZ: హీరో వీడా నుంచి స్పోర్ట్స్ లుక్ బైక్..100కు పైగా మైలేజ్!
హీరో విడా VXZ (Hero Vida VXZ ) పేరుతో ఈ బైక్ తీసుకువస్తున్నారట.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు కూడా, రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే హీరో వీడా బ్రాండ్ నుంచి సరికొత్త బైక్ రాబోతోంది. హీరో విడా VXZ (Hero Vida VXZ ) పేరుతో ఈ బైక్ తీసుకువస్తున్నారట.
ఇటలీలో జరిగిన ఆటో ఎగ్జిబిషన్ 2025 EICMA సందర్భంగా ఈ ప్రకటన చేశారు. అంతేకాదు ఈ VXZ బైక్ పేరుతో టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో వీడా కొత్త మోడల్ బైక్ స్పోర్ట్స్ లో కనిపించింది. దీంతో ఇది స్పోర్ట్స్ బైక్ అని అంటున్నారు. ఈ బైక్ ధర, ఫీచర్స్ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. త్వరలోనే అధికారికంగా ఈ బైక్ ను లాంచ్ కూడా చేయనున్నారు. అప్పుడు పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక ఈ బైక్ ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 100 కిలో మీటర్లకు పైగా మైలేజ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.






