Hero Electric Flash: జస్ట్ యాభై వేల లోపే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఉందా? అయితే ఈ ఆప్షన్ మీకోసం..!!

by Vennela |   (  Updated:2025-05-19 15:59:40  IST  )

Hero Electric Flash: మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ అనగానే లక్ష రూపాయలు బడ్జెట్ లోనే లభిస్తున్నాయి

Hero Electric Flash: జస్ట్ యాభై వేల లోపే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఉందా? అయితే ఈ ఆప్షన్ మీకోసం..!!
X

దిశ, వెబ్ డెస్క్: Hero Electric Flash: మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ అనగానే లక్ష రూపాయలు బడ్జెట్ లోనే లభిస్తున్నాయి. కానీ మార్కెట్లో ప్రస్తుతం అన్నిటికన్నా తక్కువ ధరలో లభించే ఏకైక స్కూటర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ స్కూటర్ 50 వేల రూపు లభిస్తోంది అది కూడా బ్రాండెడ్ ఆటోమొబైల్ కంపెనీ నుంచి లభిస్తూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ మోడల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. Hero Electric Flash LX (VRLA) ఈ మోడల్ ధర మార్కెట్లో అత్యంత తక్కువకే లభిస్తోంది దీని ప్రారంభ ధర రూ. 46,640 లభిస్తోంది. ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే 250W BLDC హబ్ మోటార్ తో ఈ బైక్ నడుస్తుంది.

దీని బ్యాటరీ మోడల్ 48V 20Ah VRLA (Lead Acid)తో లభిస్తోంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 25 km. ఒకసారి ఛార్జింగ్‌తో 50-60 km మైలేజ్ లభిస్తుంది. బ్యాటరీ చార్జింగ్ సమయం ఛార్జింగ్ సమయం 8-10 గంటలుగా ఉంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే డ్రమ్ బ్రేక్‌లు ఫ్రంట్ అండ్ రియర్ అందించారు. రెడ్, సిల్వర్, వైట్ రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంది.

ఇక సెక్యూరిటీ కోసం కాంబైండ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) ఇందులో ఉంది. అంటీ-థెఫ్ అలారం, బైక్ వారంటీ: 3 సంవత్సరాలు, బ్యాటరీ వారంటీ: 1 సంవత్సరం, చార్జర్ వారంటీ 1 సంవత్సరం అందించారు. ఈ బైక్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ బైకు 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో తిరిగేవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది.

ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ నడిపేందుకు ఈ బైక్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మార్కెట్లో చాలా అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది కూడా ఒకటి. ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ పైన బ్యాంకులు ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి.

Next Story