Best Safety Cars: ఈ కార్లు చాలా సేఫ్‌... ధర కూడా చాలా తక్కువ

by Vennela |

Best Safety Cars: భారత్ లో వాహన వినియోగదారుల్లో సేఫ్టి(Best Safety Cars)కి ప్రాధాన్యత ఇవ్వడం పెరుగుతోంది.

Best Safety Cars: ఈ కార్లు చాలా సేఫ్‌... ధర కూడా చాలా తక్కువ
X

దిశ,వెబ్‌డెస్క్: Best Safety Cars: భారత్ లో వాహన వినియోగదారుల్లో సేఫ్టి(Best Safety Cars)కి ప్రాధాన్యత ఇవ్వడం పెరుగుతోంది. దాంతో వాహన తయారీదారు సంస్థలు కూడా సేఫ్టీ ఫీచర్ల(Best Safety Cars)పై ఫోకస్ పెడుతున్నారు. ప్రభుత్వాలు కూడా వాహనాల్లో సేఫ్టీ ఫీచర్స్ ను కచ్చితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 10లక్షల లోపు ధరలో లభించే 5 టాప్ రేటెడ్ సేఫ్టీ కార్ల జాబితా ఇప్పుడు చూద్దాం.

మారుతి సుజుకి సెలెరియా:

మారుతి సుజుకి సెలెరియా భారతదేశంలో ఆరు ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా తీసుకున్న అత్యంత సరసమైన కారుగా అతరించింది. రూ. 5.64 లక్షల ప్రారంభ ధర కలిగిన సెలెరియాలో ప్రయాణికులందరికీ మూడు పాయింట్ల సీట్ బెల్ట్, ఫోర్స్ లిమిటర్లతో కూడిన ఫ్రంట్ సీట్ బెల్డ్ ప్రీ టెన్షన్స్ , సీట్ బెల్ట్ రిమైండర్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, జారిపోయే రూడ్లపై మెరుగైన కంట్రోల్ కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి అదనపు భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ మాగ్నైట్ ఈమధ్యే ఫేస్ లిస్ట్ తో అప్ డేట్ చేశారు. ఇది ప్రస్తుతం భారత్ లో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్ యూవీ. దీని ప్రారంభ ధర రూ. 6.12 లక్షలు. ఎంట్రీ లెవల్ వీసా వేరియంట్లో ఆరు బ్యాగులతో పాటు 360 డిగ్రీల కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. నిస్సాన్ మాగ్నైట్ లో 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 71బీహెచ్ పీ పవర్ , 96 ఎన్ ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్ టర్

కాంపాక్ట్ ఎస్ యూవీ కేటగిరీలో పాపులర్ కారు హ్యుందాయ్ ఎక్స్ టర్. దీని బేస్ ఎక్స్ వేరియంట్ ధర రూ. 6.13 లక్షలు. హ్యుందాయ్ ఎక్స్ టర్ లో డ్యాష్ కామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, ఏబీఎస్ విత్ ఈబీడీ సహా మరెన్నో సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులోని1.2 లీటర్ ఇంజన్ 82 బిహెచ్ పి పవర్, 113.8ఎన్ఎమ్ టార్క్స్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ తన అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్ గా అందిస్తుంది. రూ. 5.92లక్షల ప్రారంభ ధరతో ఉన్న ఈ హ్యాచ్ బ్యాక్ 82 బీహెచ్పీ పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2లీటర్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యానువల్ వేరియంట్ తోపాటు ఎఎమ్ టీ వేరియంట్ కూడా ఉంటుంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్, రివర్స్ కెమెరాతో రియర్ పార్కింగ్ సెన్సార్లు ఇతర ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

సిట్రోయెన్ సి3

ఫ్రెంచ్ వాహన తయారీదారు సంస్థ సిట్రోయెన్ కూడా తన ఎంట్రీ లెవల్ మోడల్ సి3లో ఆరు ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా అందిస్తోంది. రూ. 6.16లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ కారులో ఎబిఎస్ విత్ ఇబిడి, ఇఎస్పి, హిల్ హెల్డ్ అసిస్ట్, డే నైట్ ఇన్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అయితే ఆరు ఎయిర్ బ్యాగుల సెటప్ ఫీల్ షైన్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 7.47లక్షలు

Next Story