ఎల‌క్ట్రిక్ బైక్స్ కొనేవారికి షాక్‌.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచే అమ‌లు !

by velandi.Saikiran |

ఏథర్ ఎనర్జీ (Ather Energy) స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే వాటి ధరలు

ఎల‌క్ట్రిక్ బైక్స్ కొనేవారికి షాక్‌.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచే అమ‌లు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా సెంచరీ దాటేశాయి. దీంతో పెట్రోల్ వాహనాలు వాడేందుకు జనాలు వణికిపోతున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. 40 వేల నుంచి మొదలుకొని రెండు లక్షల వరకు కూడా టూ-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది సాధారణ పౌరులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనేస్తున్నారు.

ఇక మార్కెట్లో ఏథర్ ఎనర్జీ (Ather Energy) స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే వాటి ధరలు త్వరలోనే పెరగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమలులోకి వస్తాయట. ఒక్కో బైక్ పైన రూ.3000 వరకు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముడి సరుకు, ఇతర ఎలక్ట్రిక్ పార్ట్స్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట కంపెనీ. కాగా ఈ ఏథర్ ఎనర్జీలో లక్ష 14 వేల నుంచి 1,82,000 వరకు బైక్ ధరలు ఉన్నాయి. ఒక్కో మోడల్ ఒక్కో రేటు ఉంటుంది. ఇక‌ ఏథర్ ఎనర్జీ త‌ర‌హాలోనే ఇత‌ర ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల ధ‌ర‌లు పెరిగే ఛాన్స్ ఉంద‌ని చెబుతున్నారు.

Next Story