- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనదారులకు అలర్ట్..ఇలా చేస్తే పెట్రోల్ ఆదా అవుతుంది!
పెట్రోల్ కొరత ఉన్న నేపథ్యంలో బైక్ మైలేజ్ ఇచ్చేందుకు తగిన స్పీడ్ తో వెళ్లాలని సూచనలు చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొన్నటి వరకు కొనసాగిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది. ఇండియాలో కూడా ఈ సమస్య తలెత్తుతోంది. అయితే ఈ నేపథ్యంలో పెట్రోల్ ఎలా సేవ్ చేసుకోవాలి అని జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే చమురు కొరత ఉన్న నేపథ్యంలో కొన్ని టిప్స్ పాటిస్తే, పెట్రోల్ ఆదా కావడమే కాకుండా బైక్ మైలేజ్ కూడా ఎక్కువగా ఇస్తుంది. దాని ద్వారా మనకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఈ కొరత ఉన్న నేపథ్యంలో ఇంధనం ఆదా కచ్చితంగా చేయాలి.
స్థిరమైన, నియంత్రిత స్పీడ్ తో బైక్ నడిపితే, ఆయిల్ కచ్చితంగా మిగులుతుందని చెబుతున్నారు నిపుణులు. 30 సెకండ్ల కంటే ఎక్కువ సమయం వాహనాన్ని నిలపాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంజన్ ఆఫ్ చేయాలని అంటున్నారు. ముఖ్యంగా బైక్ టైర్లలో సరిపడ గాలి ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. పదే పదే వాహనం వాడకుండా ఇంటికి అవసరమైన వస్తువులను ఒకేసారి తెచ్చుకోవడం ఉత్తమమని సూచనలు చేస్తున్నారు. ఇక కార్లలో ఏసీ వాడకం తగ్గించుకోవడంతో పాటు ఎయిర్ ఫిల్టర్ చెకింగ్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్ ను టైంకు మార్చుకుంటే బెటర్ అంటున్నారు.






