- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్ కొనుగోలు చేసేవారికి అలర్ట్.. వచ్చే ఏడాది నుంచి కొత్త నిబంధనలు?
ప్రస్తుతం రోడ్డు ప్రమాదల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వెలుగు చూస్తుండటం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం రోడ్డు ప్రమాదల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వెలుగు చూస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు మరియు రోడ్ల అభివృద్ధి పై మరింత దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది(2026) జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకు రానుంది. 2026 నుంచి కొనుగోలు చేసే టూవీలర్లకు ఇంజిన్ పరిమాణం తో సంబంధం లేకుండా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) ఉండాల్సి ఉంటుంది. జనవరి 1, 2026 నుంచి ప్రతి కొత్త టూవీలర్‌తో పాటు రెండు BIS సర్టిఫైడ్ హెల్మెట్‌లు అందించనున్నారు. డీలర్‌లు వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్స్ అందించాలి. రైడర్ మరియు పిలియన్ హెల్మెట్ ధరించాలి. లేకపోతే రూ.వేలల్లో ఫైన్స్ విధించవచ్చు.
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) ఉపయోగం ఏంటంటే.. ఏబీఎస్ లేకుండా బైక్ నడిపినట్లైతే.. రైడర్ అత్యవసర పరిస్థితుల్లో బ్రేకులు వేసినట్లైతే టైర్లు లాక్ అవ్వడం వల్ల వాహనం జారిపోయి నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ABS కీలక పాత్ర పోషిస్తుంది. వెంటనే టైర్లను లాక్ కానివ్వదు.. దీంతో బైక్ రైడర్ వాహనంపై నియంత్రణ కోల్పోకుండా ఉంటుంది. ప్రస్తుతం టూవీలర్ వాహనాల్లో ABS రెండు రూపాల్లో ఉంటుంది. సింగిల్ ఛానల్ ABS ముందు చక్రానికి, డ్యూయల్ ఛానల్ ABS ముందు, వెనుక రెండింటికీ విడివిడిగా పని చేస్తుంది.






