- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bajaj Pulsar:న్యూ వెర్షన్ పల్సర్ 180 వచ్చేసింది..ధర, ఫీచర్స్ ఇవే
బజాబ్ పల్సర్ 180 న్యూ వెర్షన్ ను తాజాగా ఇండియాలో లాంచ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారతీయ మార్కెట్ లో బజాజ్ పల్సర్ బైక్స్ మంచి క్రేజ్ ఉంటుంది. యూత్ ను బాగా ఆకట్టుకునే ఈ పల్సర్ బైక్స్, ఇప్పటికీ.. ఎప్పటికీ పాపులరే. బుల్లెట్ బాగా పాపులర్ కాక ముందు చాలామంది ఈ పల్సర్ బైక్స్ మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించేవారు. దానికి తగ్గట్టుగానే మంచి ఫీచర్స్ తో బజాజ్ కంపెనీ, పల్సర్ బైక్స్ తీసుకువస్తోంది. అయితే లేటెస్ట్ గా బజాజ్ పల్సర్ 180 ( 2026 Bajaj Pulsar 180 ) కొత్త వెర్షన్ ను తీసుకువచ్చింది కంపెనీ. ఈ బైక్ ధర రూ.1.22 లక్షలుగా ఫిక్స్ చేశారు. ఢిల్లీలోని ఎక్స్ షోరూం ప్రకారమే ఈ ధర ఉంటుంది. పల్సర్ 150, 220 F మధ్యస్థానాన్ని ఈ Bajaj Pulsar 180 బైక్ భర్తీ చేయనుంది. పాత క్లాసిక్ డిజైన్ ను కొనసాగిస్తూనే, కొత్త ఫీచర్స్ తో ఈ 180 బైక్ తీసుకొచ్చింది.
బజాజ్ పల్సర్ 180 ఫీచర్స్
ఈ కొత్త మోడల్ పల్సర్ కు మునుపటి కంటే షార్ప్ గా ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ లు ఉండనున్నాయి. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్ లు కూడా అందిస్తున్నారు. బ్లూ-టూత్ కనెక్టివిటీ, కాల్ లేదా ఎస్ఎంఎస్ అలర్ట్ లు కూడా ఈ కొత్త బైక్స్ లో అందుబాటులోకి వస్తాయి. నావిగేషన్ సపోర్టు కూడా ఉండనుంది. 15 లీటర్ల పెట్రోల్ ట్యాంకర్ అందిస్తున్న కంపెనీ, సింగిల్ ఛానల్ ABS ఫీచర్ కూడా తీసుకువస్తోంది. 16.77 బీహెచ్పీ పవర్, 15 NM టార్క్ కూడా రిలీజ్ చేస్తుంది.






