- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TVS Apache: టీవీఎస్ నుంచి మరో సూపర్ డూపర్ బైక్.. ధర కూడా చీప్
TVS Apache: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ టీవీఎస్ 2025 అపాచీ ఆర్ఆర్ 310 ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: TVS Apache: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ టీవీఎస్ 2025 అపాచీ ఆర్ఆర్ 310 ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. అపాచీకి 20ఏళ్లు పూర్తి చేసుకుని 60లక్షల మైలురాయిని ఇటీవల అందుకున్న ఈసంస్థ..తాజాగా ఓబీడీ 2బీ ప్రమానాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది. దీని ధర రూ. 2,77,999 నుంచి ప్రారంభమవుతుంది.
కొత్త అపాచీ 312 సీసీ రివర్స్ ఇన్ క్లెయిన్డ్ డీఓహెచ్ సీ ఇంజిన్ తో తీసుకువచ్చింది. ఇది 38పీఎస్ పవర్ ను , 29 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది. ట్రాక్, స్పోర్ట్, అర్బన్, రెయిన్ మెడ్స్ ఉన్నాయి. 8 స్పోక్ అల్లాయ్ వీల్స్ తో వస్తోంది. ఇందులో స్టాండర్డ్ వేరియంట్, కస్టమైజేషన్ ఆప్షన్ తో కూడిన బిల్ట్ టు ఆర్డర్ వేరియంట్లు లభిస్తాయి. రెడ్ వితౌట్ క్విక్ షిప్టర్ రూ. 2,77,99, రెడ్ వితౌట్ క్విక్ షిఫ్టర్ రూ. 2,94,999. బాంబర్ గ్రే రూ. 2,99,999గా నిర్ణయించారు. బీటీఓ ఆప్షన్ లో డైనమిక్ కిట్ రూ. 18వేలు, డైనమిక్ ప్రో కిట్ రూ. 16వేలు, రేస్ రెప్లికా రూ. 10వేలుగా నిర్ణయించారు.
కొత్త Apache RR 310 డిజైన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. మునుపటిలాగే, హెడ్‌ల్యాంప్ LED టెయిల్ లైట్లు ఇందులో కనిపిస్తాయి. ఈ బైక్‌లో ఇప్పటికీ వింగ్‌లెట్‌లు, స్ప్లిట్-సీట్ సెటప్ ఉన్నాయి. ఈ బైక్‌లో రైడ్ మోడ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్‌ను పొందుతుంది. ముందు భాగంలో 300mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 240mm డిస్క్ బ్రేక్ ఉంది.






