ఆటో మొబైల్స్​ రంగంలో ఆల్​టైం రికార్డ్​

by  |
ఆటో మొబైల్స్​ రంగంలో ఆల్​టైం రికార్డ్​
X

దిశ, శేరిలింగంపల్లి: కరోనా సగటు మనిషి జీవన ప్రయాణంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. సామాజిక ప్రయాణం కంటే సేఫ్​జర్నీ బెటర్​ అంటున్నారు సిటీ జనులు.. ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి ఆఫీసుకు చేరుకోవాలంటే తప్పనిసరిగా వాహనం అవసరం. అసలే కరోనా భయం ఇంకా వీడలేదు. ప్రతీ ఒక్కరికి సొంత వాహనం అవసరం ఏర్పడింది. దీంతో ఫస్ట్​, సెకండ్​హ్యాండ్​ కార్లు, బైక్​ల కొనుగోలు పెరిగాయి. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనివిధంగా అమ్మకాలు జరిగినట్లు వాహన డీలర్లు, సేల్స్​ప్రమోటర్స్​పేర్కొంటున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు సైతం సొంత వాహనంలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. కోరుకున్న వాహనం కావాలంటే బుక్​చేసుకున్న రెండు మూడు నెలలకు కానీ డెలివరీ కావడంలేదంటే వాహనాల డిమాండ్​ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాహనాల కొనుగోళ్లలో ఆల్​టైమ్​రికార్డ్ తో షోరూం నిర్వాహకులు ఖుషీ అవుతున్నారు.

కొత్త, పాత కార్లు, బైక్​లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనా భయంతో బస్సులు, రైళ్లలో ప్రయాణించడంకంటే సొంత వాహనాల్లోనే వెళ్లడమే బెటర్ అనుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆటోమొబైల్స్ రంగం టాప్ గేర్ లో దూసుకుపోతోంది. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలోనే సేల్స్ బాగా పెరిగాయని వాహన డీలర్లు చెబుతున్నారు.

అంతా కరోనా ఎఫెక్ట్..

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనాల్లో మాత్రం కరోనా భయం ఇంకా వీడలేదు. చాలామంది సొంత వాహనాల్లోనే తిరిగేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో ఆటోమొబైల్స్ రంగం గేర్ మార్చింది. కొద్దిరోజులుగా వాహనాల సేల్స్ విపరీతంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనం తగా ఈ వార్షిక సంవత్సరంలో సేల్స్ ఉన్నాయని చెబుతున్నారు.

కొత్త వాటికీ గిరాకీ..

మామూలుగా దసరా, దీపావళి, ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్స్ అంటూ ఆయా మోడల్స్ పై బైక్, కార్ల షో రూంల్లో ఆఫర్స్ పెడుతుంటారు. ఈసారి మాత్రం అలాంటి ఆఫర్స్ తక్కువగా కనిపించాయి. కానీ అమ్మకాలు మాత్రం గతంతో పోలిస్తే ఎక్కువగా జరిగాయి. అంతా కరోనా ఎఫెక్ట్ అంటున్నారు సేల్స్ ప్రమోటర్స్. కొండాపూర్ లోని ఓ కార్​ షోరూంలో మూడు నెలల కాలంలో సుమారు 300 వాహనాలు అమ్ముడు పోయాయంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మదీనా గూడలోని ఓ బైక్ షో రూంలో వందలాది బైక్స్ అమ్ముడు పోయాయని షోరూం డీలర్​ పేర్కొన్నాడు.

సెకండ్ సేల్స్ లోనూ టాప్..

సెకండ్ హ్యాండ్ కార్, బైక్​లకు సైతం ఫుల్ డిమాండ్ ఉంది. సేఫ్ జర్నీ కోసం సెకండ్ హ్యాండ్ బైక్స్, కార్లు కొనుగోలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో సెకెండ్​హ్యాండ్​వాహనాల అమ్మకాలు జరిగినట్లు అమ్మకందారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాలపై ఈఎంఐ, ఫైనాన్స్ సదుపాయం లభించడం కూడా వాహనాల కొనుగోలుకు ఊపునిచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్, కాగితాల మార్పిడి విషయంలోనూ పెద్దగా ఇబ్బందులు లేవని ఆలోచనతో సెకండ్ హ్యాండ్ వాహనాలను మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.

పాత బైక్స్​ అన్ని అమ్ముడుపోయాయి..

ఈ మధ్యకాలంలో సేల్స్ బాగా పెరిగాయి. కొత్తకొత్త మోడల్స్ కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపెడుతున్నారు. మా దగ్గర ఉన్న పాత బైక్స్ దాదాపు అన్నీ అమ్ముడు పోయాయి. కొత్త మోడల్ బైక్స్ కోసం కనీసం మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే..
–కర్నే నరేష్, రాయల్ ఎన్ ఫీల్డ్ హేడ్వే మోటార్స్

పెరిగిన అమ్మకాలు..

ఈ ఫీల్డ్ 15ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధం గా ఈ మధ్యకాలంలో కార్ల అమ్మ కాలు జరిగాయి. ఒక్క డిసెంబర్ లోనే మా షోరూం నుంచి సుమారు 225 కార్లను విక్రయించాం. ఇప్పుడు మా దగ్గర మోడల్ కార్లు తప్ప ఒక్క కారు లేదు. బుక్ చేసుకుంటే కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది.
–పవన్ కుమార్, నెక్సా షోరూం మేనేజర్



Next Story