ఆటో పరిశ్రమకు పన్ను తగ్గింపు, స్క్రాపేజ్ విధానం అవసరం

by  |
ఆటో పరిశ్రమకు పన్ను తగ్గింపు, స్క్రాపేజ్ విధానం అవసరం
X

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు రెండేళ్ల అనంతరం ఆటో పరిశ్రమ ఇటీవలే పుంజుకుంటున్న క్రమంలో రానున్న బడ్జెట్‌లో దేశీయ తయారీకి ప్రోత్సాహకాలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరోనా, లాక్‌డౌన్ సవాళ్లతో కొనుగోళ్లు భారీగా క్షీణించాయి. ఆ తర్వాత పరిశ్రమ నెమ్మదిగా కోలు కుంది. ఈ క్రమంలోనే పరిశ్రమల సంఘం ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేష న్(ఎఫ్ఏడీఏ) పన్నుల విధానం, స్క్రాపేజ్ విధానాలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పం పింది. ఆటోమొబైల్ రంగంపై పన్నులు అధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించాల్సిన అవసరం ఉం దని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి.

ప్రస్తుతం ప్రభుత్వం వాహన సర్టిఫికేట్ విధానం తీసుకురావడం లేదా వాహనాల జీవన కాలం వరకు విని యోగించేలా చూడాలి. రెండు విధానాలను అమలు చేసేందుకు మరింత సమయం పడుతుంది. పాత వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపేజ్‌గా మార్చడానికి వాహనదారులను ప్రోత్సహించాలని పరిశ్రమ కోరుతోంది. అదేవిధంగా, ఆటో పరిశ్రమపై పన్ను మినహాయింపులు అవసరమని తయారీదారులు అభ్యర్థి స్తున్నారు. కీలకంగా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ధరల తగ్గింపును వారు కోరుతున్నారు. అంతేకాకుండా ఎల క్ట్రానిక్స్, అసెంబ్లింగ్ యూనిట్ల ఏర్పాటు, సెమీకండక్టర్ల కోసం విదేశీ పెట్టుబడులను రాబట్టేలా విధానాలను ప్రకటించాలని కోరుతున్నారు.


Next Story