దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి యత్నం

by  |
Auto driver Ramesh
X

దిశ, జల్‌పల్లి: ఇంటి ఎదుట ఆడుకుంటోన్న నాలుగేళ్ళ బాలికను ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేశాడు. అనంతరం శంషాబాద్ ఎయిర్​పోర్ట్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్ళి లైంగిక దాడికి యత్నించాడు. పహాడీషరీఫ్ ఎస్ఐ దేవకి వివరాల ప్రకారం.. బాలాపూర్ మండలం మామిడిపల్లి విలేజ్‌కు చెందిన తాటిపర్తి రమేష్​(20) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్‌. ఈనెల 2వ తేదీన ఉదయం 10.30 గంటల సమయంలో ఇంటి బయట ఒంటరిగా ఆడుకుంటోన్న నాలుగేండ్ల చిన్నారిని రమేష్ కిడ్నాప్​చేశాడు. కాసేపటికే కూతురు కనిపించడం లేదన్న విషయాన్ని గమనించిన తల్లి తన భర్తకు ఫోన్​చేసి చెప్పింది. వెంటనే ఇంటికొచ్చి బాలిక ఆచూకీ కోసం తెలిసినా చోటళ్లా వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది.

బాలిక తండ్రి స్నేహితుడు విజయ్‌తో కలిసి చుట్టు పక్కల ప్రాంతాల్లో బైక్‌పై వెతకసాగారు. ఎయిర్ పోర్ట్ రహదారిలో నిర్మానుష్య ప్రాంతంలోని చెట్లపొదల్లో బాలిక పట్ల రమేష్ అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని గమనించారు. వెంటనే రమేష్‌ను పట్టుకొని చితకబాదారు. అనంతరం తన నాలుగేళ్ల కూతురిపై లైంగికదాడికి యత్నించాడని 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందుకున్న పహాడిషరీఫ్​పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును పహాడిషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed