- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2 కోట్లు బురదలో పోసిన పన్నీరే.. గుంతల మయంగా బీటీ రోడ్డు
<p>దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మూడు కోట్లతో సెంటర్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు వేసిన బీటీ రోడ్డు గుంతల మయంగా మారింది. 500 మీటర్ల పై చిలుకు బీటీ రోడ్డు వేయడానికి 2 కోట్లును ప్రభుత్వం కేటాయించింది. ప్రజా ఆరోగ్య, పురపాలక సాంకేతిక శాఖ నిధులు (టీయుఎఫ్ ఐ డీ సీ గ్రాంట్) తో వేసిన బీటీ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, […]</p>

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మూడు కోట్లతో సెంటర్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు వేసిన బీటీ రోడ్డు గుంతల మయంగా మారింది. 500 మీటర్ల పై చిలుకు బీటీ రోడ్డు వేయడానికి 2 కోట్లును ప్రభుత్వం కేటాయించింది. ప్రజా ఆరోగ్య, పురపాలక సాంకేతిక శాఖ నిధులు (టీయుఎఫ్ ఐ డీ సీ గ్రాంట్) తో వేసిన బీటీ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు మహబూబాబాద్ నుంచి తొర్రూర్ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లా కేంద్రంలోనే నాణ్యత లోపంతో ప్రధాన రహదారులు వేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ శాఖ అధికారులు బిల్లులు సైతం పూర్తి స్థాయిలో చెల్లింపు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఈ పనులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దుమ్ము,ధూళీ లేస్తుంది..

రోడ్డుపై వాహనాలు నడుపుతుంటే దుమ్ము,ధూళీ లేచి కళ్లల్లో పడుతుంది. దీనివలన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఇంత దారుణంగా రోడ్లు ఉంటే, గ్రామీణ స్థాయిలో పరిస్థితి మరీ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . సంబంధిత కాంట్రాక్టు పై చర్యలు తీసుకుని, రోడ్డు మరమ్మతులు చేయాలి
బి.రాము,స్థానికుడు
ప్రయాణం నరకయాతనం

ఆటోలో ఇటు వైపుగా వెళ్లాలంటే నరకయాతన చూస్తున్నాము. 500 మీటర్ల ప్రయాణమే దారుణంగా ఉంది. అధికారులు దగ్గర ఉండి రోడ్లు వేయిస్తే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు. ప్రజల ధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
చందు,ఆటో డ్రైవర్
డబుల్ లేయర్ వేస్తాం
వర్ష కాలం కారణంగా రోడ్డు పనులు నిలిపివేశాము. సింగిల్ లేయర్ వేశారు. డబుల్ లేయర్ వేయాల్సి ఉంది. త్వరలోనే వేస్తాం.
మున్సిపల్ ఏ.ఈ సురేశ్






