- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పకూలిన అరబిందో ఉద్యోగి.. మీదే బాధ్యతంటున్న భార్య
<p>దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ ఇజ్జత్ నగర్‌లోని అరబిందో రియాల్టీ సంస్థలో హౌస్ కీపింగ్ వర్కర్‌గా పనిచేస్తున్న జెట్టి అశోక్ (35) ఎప్పటిలాగే ఉదయం పనికి వెళ్లి కంపెనీలో పనిచేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలాడు. దీంతో సంస్థ ప్రతినిధులు అతన్ని మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. మృతుడు అశోక్‌కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, కంపెనీలో ఏదో జరిగి ఉంటుందని.. తన భర్త ప్రమాదవశాత్తు మృతి చెందలేదని […]</p>

దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ ఇజ్జత్ నగర్‌లోని అరబిందో రియాల్టీ సంస్థలో హౌస్ కీపింగ్ వర్కర్‌గా పనిచేస్తున్న జెట్టి అశోక్ (35) ఎప్పటిలాగే ఉదయం పనికి వెళ్లి కంపెనీలో పనిచేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలాడు. దీంతో సంస్థ ప్రతినిధులు అతన్ని మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. మృతుడు అశోక్‌కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, కంపెనీలో ఏదో జరిగి ఉంటుందని.. తన భర్త ప్రమాదవశాత్తు మృతి చెందలేదని భార్య జెట్టి మాధవి ఆరోపిస్తోంది. తన భర్త మృతికి కంపెనీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని భార్య జెట్టి మాధవి కన్నీటి పర్యంతమైంది. కాగా, మృతుడికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
అఖిలపక్ష నాయకుల ఆందోళన..
అరబిందో కంపెనీలో అకస్మాత్తుగా మృతిచెందిన అశోక్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇజ్జత్ నగర్‌లోని కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే, కంపెనీ యాజమాన్యం మాత్రం ఇందుకు ఒప్పుకోకపోవడంతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
బతుకుదెరువు కోసం పాలమూరు టు హైదరాబాద్..
మహబూబ్ నగర్ జిల్లా రేవల్లి మండలం సిరిగేపల్లికి చెందిన జెట్టి అశోక్‌కు భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం గత 20ఏళ్ల కిందట నగరానికి వలసవచ్చి మాదాపూర్ డివిజన్ ఇజ్జత్ నగర్‌లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటి పెద్ద అశోక్ మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో వీధిన పడింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకులు నగేష్ నాయక్, సురేష్ నాయక్, రామకృష్ణ, చందు యాదవ్, కాసీం, వెంకటస్వామీ, నారాయణ, గోవింద్, బీజేపీ నాయకులు రాధాకృష్ణ యాదవ్ శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ రెడ్డి బస్తీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆందోళన చేశారు.






