ఆడియో టేపులు : చైనా,డబ్ల్యూహెచ్ఓ దొందూ దొందే..?

by  |
ఆడియో టేపులు : చైనా,డబ్ల్యూహెచ్ఓ దొందూ దొందే..?
X

దిశ,వెబ్‌డెస్క్: కరోనా వైరస్ విషయంలో చైనా- డబ్ల్యూహెచ్ఓల కుట్ర మరోసారి వెలుగులోకి వచ్చాయి. పైకి ప్రపంచదేశాల ముందు చైనాను వెనకేసుకొస్తున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్ విషయంలో వస్తున్న విమర్శల నుంచి చైనాను కాపాడే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్ నగరం నుంచి పుట్టిన విషయం తెలిసిందే. అయితే అది సహజంగా పుట్టింది కాదని, చైనా వుహాన్ ల్యాబ్‌లోనే తయారైందన్న అనుమానాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గతంలో కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందని, అమెరికాతో పాటు పలు దేశాలు ఈ విషయంపై చైనాపై దుమ్మెత్తిపోశాయి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాయి. చైనా మాత్రం ఇది కరోనా ల్యాబ్ లో సృష్టించింది కాదని, మొదటి నుంచి చెబుతూనే ఉంది. కానీ వైరస్ ఎలా పుట్టిందో నోరు మెదపడం లేదు. ఎప్పటికప్పుడు ఈ విషయంపై ఏదో ఒకటి చెబుతూ తప్పించుకుంటూనే ఉంది. కరోనా పుట్టుక గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. అయితే సహజంగా పుట్టుకొచ్చిందేనని చాలా మందిచెబుతున్నారు. ఓ దశలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. కానీ చైనా – డబ్ల్యూహెచ్ఓ సంబంధాలు, కరోనా సృష్టిస్తున్న మరణాలు, వైరస్ పై వస్తున్న రకరకాల ఊహాగానాలు చూస్తుంటే వైరస్ చైనా వుహాన్ ల్యాబ్ లోనే పుట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా, జర్మన్, బ్రిటన్ శాస్త్రవేత్తలు సైతం కరోనా చైనా ల్యాబ్ లోనే పుట్టిందని అంటున్నాయి.

ఈ వైరస్ జంతువుల నుంచి వచ్చింది కాదని, మానవ తయారీ అని ఫ్రాన్స్ వైరాలజిస్ట్, వైద్యంలో నోబెల్ అవార్డ్ గ్రహిత లూక్ మోంటాగ్నియర్ అన్నారు. చైనా వుహాన్ ల్యాబ్ లోని ఎయిడ్స్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో భాగంగా కరోనావైరస్ ను సృష్టించినట్లు మీడియాకు చెప్పారు. అయితే డబ్ల్యూహెచ్ కరోనా వైరస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. చైనా ల్యాబ్ లో కరోనా వైరస్ ను తయారు చేశారని, అమెరికాతో సహా పలు ప్రపంచ దేశాలు చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ జంతువుల ద్వారానే ఈ వైరస్ పుట్టినట్లు తెలిపింది. ఇప్పటి వరకు తాము చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ జంతువుల నుంచి పుట్టినట్లు తేలిందని, ల్యాబ్ లో తయారు చేసిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఎవరు ఎన్ని చెప్పిన ప్రపంచం వినడం లేదు. కరోనా వైరస్ ను చైనాయే కావాలని సృష్టించిందనే వాదనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

తాజాగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధులు రహస్యంగా మాట్లాడిన ఆడియో టేపులు వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ బృందం నిపుణులు కరోనా వైరస్ పుట్టుపూర్వత్రాల గురించి చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధులు రహస్యంగా మాట్లాడుకున్న ఆడియో టేపులు వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తుంది.

ఇందుకు సంబంధించిన ఆడియోటేపుల్ని ఓ జాతీయ మీడియా సంస్థ వెలుగులోకి వచ్చింది. గతేడాది జనవరి రెండో వారంలో మాట్లాడుకున్న ఆడియో టేపుల్లో తాము అడిగిన డేటాను చైనా ఇవ్వడంలేదంటూ చైనాపై డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య ప్రతినిధుల బృందం తన సహచర ఉద్యోగులతో మాట్లాడుతూ తన కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. విడుదలైన ఆడియో టేపుల్లో ముందుగా డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్‌ ఎమర్జెన్సీ అధిపతి డాక్టర్‌ మైఖెల్‌ రియాన్‌ మాట్లాడుతూ చైనా విషయంలో మనం మన వైఖరిని మార్చుకోవాలి. దక్షిణ చైనా సముద్రం యొక్క ఉత్తర తీరంలో దక్షిణ చైనాలోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో ఏం జరుగుతుందో చెప్పమని అంటుంటే చెప్పడంలేదు. అంతేకాదు సౌత్రన్ చైనాలో తలెత్తిన సమస్యలనుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బయటపడింది.

రెండో క్లిప్ లో అదే మైఖెల్ రియాన్ మాట్లాడుతూ.., జనరల్ మనుషుల్లో ఒకరినుంచి ఒకరికి వైరస్ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు వెలుగులోకి రాలేదు. ఇలా కాంగోతో పాటు ఇతర ప్రాంతంలో జరగలేదు. సెంట్రల్ ఏసియాకు చెందిన కాంగోలో ఆగస్ట్ 1, 2018లో ఎబోలా వైరస్ పుట్టింది. అక్కడి నుంచే ఈ కరోనా వైరస్ పుట్టి మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ సోకిన ఆధారాలు లేవు. అలాంటప్పుడు మనమే జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వైరస్ ను గుర్తించవచ్చు కదా. ఈ సమయంలో దీని గురించి మన దగ్గర డేటా లేదు కాబట్టి కరోనా వైరస్ చైనాలో పుట్టిందన్న ఆరోపణలపై చైనాను మనం రక్షించగలం. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు డబ్ల్యూహెచ్- చైనాల సంబంధాలు ఎలా ఉన్నాయో

మూడో ఆడియో టేప్ లో క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన జ‌న్యు క్ర‌మాన్ని(జెన‌టిక సీక్వెన్స్‌) గుర్తించిన‌ డ‌బ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్రోగ్రామ్‌లో టెక్నిక‌ల్ హెడ్ డాక్ట‌ర్ మారియా వాన్ కెర్కోవ్ మాట్లాడుతూ వెంటిలేషన్, ఐసీయూ, ఎక్మో మరణాల గురించి కొంచెం తెలుసుకునేందుకు మనదగ్గర తగిన సమాచారం లేదు. వైరస్ గురించి తెలుసుకునేందుకు ఓ ప్రణాళికను తయారు చేయాలంటే చైనా డేటా కావాలి. ఆ డేటా సరిపోదని నాకు తెలుసంటూ WHOకి చెందిన సహచర ప్రతినిధులతో మాట్లాడారు.

నాలుగో ఆడియోటేపులో డబ్ల్యూహెచ్ఓ గౌడెన్ గలేయా మాట్లాడుతూ చైనా ప్రభుత్వం నుంచి కరోనా వైరస్ కు సంబంధించి అధికారికంగా, అనధికారికంగా డేటా సేకరిస్తున్నాం . జనవరి రెండోవారంలో చైనాలో నమోదైన కేసు సంబంధించిన డేటా ఉంటే బాగుండేది. ఆ డేటా గురించే ప్రయత్నిస్తున్నామని మాట్లాడుకున్న ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి.


Next Story

Most Viewed