అరగంటలో పంపిస్తా.. రా.. అంటూ మంత్రి రాసలీలలు..? ఆడియో వైరల్!

by  |
AP Minister Romance
X

దిశ, వెబ్‌డెస్క్ : అధికారంలో ఉన్న నాయకులు, మంత్రులు ఇటీవల రాసలీలల వివాదాల్లో వరసగా చిక్కుతున్నారు. దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు నేతలు చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అవంతి శ్రీనివాస్ పేరుతో ఓ రాసలీలల ఆడియో రెండు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. ఓ మహిళతో హస్కీ వాయిస్‌తో సరసాలాడున్న ఆ వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకూ ఆ వాయిస్ మంత్రిదా.. కాదా అని క్లారిటీగా తెలియనప్పటికీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరు మీదనే షేర్ అవుతోంది. ఇంతకూ ఆ వాయిస్‌లో ఏమున్నదంటే..

హలో.. గుడ్ ఈవినింగ్ సార్.. అని ఓ లేడీ వాయిస్ రాగా.. పిచ్చి వేషాలేయకు.. ఇంటికి రా.. అంటూ ఓ వ్యక్తి ఆమెను అభ్యర్థిస్తున్నాడు. రావడం కుదరదు సార్.. అని ఆమె చెబుతున్నా.. నా మాట విను.. ఇంటికి రా.. ఓ అరగంటలో పంపిస్తా అంటూ ఆమెను రిక్వెస్ట్ చేశాడు. నాతో ఓ అరగంట కూడా స్పెండ్ చేయలేవా..? నీ మాటలకు, చేతలకు చాలా తేడా ఉంది.. చెప్పిన మాట విను. ఇంటికి రా.. అంటూ ఆమెను బతిమలాడుతున్న ఆడియో బయటకు వచ్చింది. అయితే దీనిపై మంత్రిగానీ, వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదు.



Next Story

Most Viewed