ఉపరితల వైరస్‌లను అంతం చేసే ‘అతుల్య’

by Shamantha N |   (  Updated:2020-08-11 07:02:59  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు కలవరపెడుతూనే ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్ ఎక్కడ అంటుకుంటుందోనన్న భయం వెంటాడుతూనే ఉంది. ఎక్కడకెళ్లినా శానిటైజర్‌ను వెంట తీసుకెళ్తున్నారు. కాగా వస్తువులు, ఉపరితలాలపై కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు గాను మార్కెట్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త డివైస్‌లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘మాసర్ టెక్నాలజీ’ అనే సంస్థ ఓ సరికొత్త డివైస్‌ను ఆవిష్కరించింది. దాని పేరు అతుల్య స్టెరిలైజర్. పుణేలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అభివృద్ధి [&hellip;]</p>

ఉపరితల వైరస్‌లను అంతం చేసే ‘అతుల్య’
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు కలవరపెడుతూనే ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్ ఎక్కడ అంటుకుంటుందోనన్న భయం వెంటాడుతూనే ఉంది. ఎక్కడకెళ్లినా శానిటైజర్‌ను వెంట తీసుకెళ్తున్నారు. కాగా వస్తువులు, ఉపరితలాలపై కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు గాను మార్కెట్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త డివైస్‌లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘మాసర్ టెక్నాలజీ’ అనే సంస్థ ఓ సరికొత్త డివైస్‌ను ఆవిష్కరించింది. దాని పేరు అతుల్య స్టెరిలైజర్.

పుణేలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంపై అతుల్య స్టెరిలైజర్ డివైజ్ వర్క్ చేస్తోంది. వైరస్, బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేయడానికి మైక్రోవేవ్ టెక్నాలజీ ఆధారంగా ఈ అతుల్య పనిచేస్తుంది. కాగా, ఈ డివైస్‌ను కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఆవిష్క‌రించారు. ఈ డివైస్ నుంచి వెలువ‌డే మైక్రోవేవ్ త‌రంగాలు ఉప‌రితలాల నుంచి 5 మీట‌ర్ల లోప‌ల‌కు చొచ్చుకు వెళ్ల‌గ‌ల‌వు. అందువ‌ల్ల వైర‌స్, ఇత‌ర బాక్టీరియాలు అస‌లు బ‌తికి ఉండే అవ‌కాశ‌మే లేదు. కేవ‌లం 30 సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ఉప‌రితలాలు, వ‌స్తువులపై ఉండే క్రిములు పూర్తిగా నశిస్తాయి. యూవీ, రసాయన ఆధారిత ప్రొడక్ట్స్ వల్ల కేన్సర్, స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ డివైస్ వల్ల అలాంటి సైడ్ ఎఫెక్స్ట్ ఏమీ ఉండవు. ప్రభుత్వానికి చెందిన https://gem.gov.in సైట్‌తో పాటు ఈ -కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లోనూ అతుల్య అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.12,700/-గా నిర్ణయించారు.

ఈ డివైస్ మ‌నుషుల‌కు పూర్తిగా సేఫ్ అని మాస‌ర్ టెక్నాల‌జీ తెలిపింది. అందుకు ప‌లు ర‌కాల ప‌రీక్ష‌లు కూడా చేశామ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు వెల్లడించారు. అందువ‌ల్ల దీన్ని సుర‌క్షితంగా వాడొచ్చ‌న్నారు.

Next Story