కరోనా పాజిటివ్.. మహిళ ఆత్మహత్య

by B.Srinivas |

<p>దిశ, హన్మకొండ కరోనా పాజిటివ్ రావడంతో మనస్తాపం‌ చెందిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..హసన్‌పర్తి ఎస్సీవాడకు చెందిన మేకల సౌందర్య వ్యవసాయశాఖలో అటెండర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె కొద్దిరోజులుగా జ్వరంతో బాధ పడుతోంది. అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అయ్యింది. దీంతో మనస్తాపం‌ చెందిన ఆమె పురుగుల మందు తాగి [&hellip;]</p>

కరోనా పాజిటివ్.. మహిళ ఆత్మహత్య
X

దిశ, హన్మకొండ
కరోనా పాజిటివ్ రావడంతో మనస్తాపం‌ చెందిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..హసన్‌పర్తి ఎస్సీవాడకు చెందిన మేకల సౌందర్య వ్యవసాయశాఖలో అటెండర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె కొద్దిరోజులుగా జ్వరంతో బాధ పడుతోంది. అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అయ్యింది. దీంతో మనస్తాపం‌ చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

Next Story