- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్ధరాత్రి బ్యాంకులో చోరి యత్నం.. లాకర్ పగలగొట్టి
<p>దిశ, ముధోల్ : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఇద్దరు చోదకులు చోరికి యత్నం చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి నిర్మల్ జిల్లా తానూరు మండల బెల్ తరోడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. తరోడ గ్రామంలో బ్యాంకు గేటు, షెటర్ తాళాలు పగలగొట్టుకొని బ్యాంకు లోపలకు వెళ్లి బ్యాంకు లాకర్ బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఎంతకీ లాకర్‌లు తెరుచుకోకపోవడంతో చోరీ యత్నం విఫలమయ్యింది. లాకర్ తలుపులు తేరవకపోవడంతో డబ్బులు గల్లంతు కాలేదు. […]</p>

దిశ, ముధోల్ : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఇద్దరు చోదకులు చోరికి యత్నం చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి నిర్మల్ జిల్లా తానూరు మండల బెల్ తరోడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. తరోడ గ్రామంలో బ్యాంకు గేటు, షెటర్ తాళాలు పగలగొట్టుకొని బ్యాంకు లోపలకు వెళ్లి బ్యాంకు లాకర్ బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఎంతకీ లాకర్‌లు తెరుచుకోకపోవడంతో చోరీ యత్నం విఫలమయ్యింది. లాకర్ తలుపులు తేరవకపోవడంతో డబ్బులు గల్లంతు కాలేదు. శనివారం ఉదయం ఇది గమనించిన గ్రామీణులు, బ్యాంక్ సిబ్బంది , పోలీస్‌లకు తెలపడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు డాగ్స్ స్కాడ్ ను పిలిపించి దొంగలను కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డాగ్స్ ఊరిలో గల ఓ పాఠశాల వరకి వెళ్లి మళ్ళీ రిటర్న్ వచ్చాయి. ఇదే విషయంపై బైంసా ఏఎస్‌పీ కిరణ్ కారే మాట్లాడుతూ.. నిందితులు బ్యాంకు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యారని, వాళ్ళ ముఖాలకి మాస్కులు, తొడుగులు వున్నాయని, ఆ సీసీ పుటేజ్ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి వాళ్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.






