అతడికి 16.. నిద్రిస్తున్న వృద్ధురాలు, ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం..

by  |
crime news
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పలమనేరులో 16 ఏళ్ల బాలుడు 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి తెగబడ్డాడు.. ఆమె మనవరాలిపైనా అత్యాచారానికి యత్నించాడు. ఈ షాకింగ్ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ కాలనీలో బాధిత వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఆమె బంధువులు కూడా వృద్ధురాలి ఇంటికి సమీపంలోనే ఉంటున్నారు.

కాగా, శనివారం మధ్యాహ్నం మంచంపై ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గమనించిన అదే కాలనీకి చెందిన బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత గంటకు బాధితురాలి ఆరేళ్ల మనవరాలు భోజనం తీసుకుని రాగా, నిందితుడు ఆమెపైనా లైంగికదాడికి యత్నించాడు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు.

దీంతో ఆదివారం ఇంటికి వచ్చిన తన తండ్రికి బాలిక.. జరిగిన విషయం చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు వృద్ధురాలు, ఆమె మనవరాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed