మైనర్ బాలికపై అత్యాచారయత్నం

by  |
మైనర్ బాలికపై అత్యాచారయత్నం
X

దిశ, బోధన్: కొందరు మనుషులు వ్వవహార శైలీ రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. ప్రపంచం ఆధునికంగా ఎంతో ముందుకుపోతోంది. కానీ, వారిలో ఏ మాత్రం మార్పు రావడంలేదు. వారి వ్యవహార శైలీలో ఏ మాత్రం మార్పు రావడంలేదు. వారి కామ కోరికలు తీర్చుకునేందుకు దారుణాలకు ఒడి గడుతున్నారు. పసిపాలని కూడా చూడడంలేదు. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణమైన ఘటన బోధన్ లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోధన్ మండలంలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి గణేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశాడు. ఆ బాలిక అతడి చెర నుంచి తప్పించుకుని విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు, గ్రామస్తులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed