సూర్యాపేటలో దారుణం.. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

by  |
సూర్యాపేటలో దారుణం.. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. సభ్యసమాజం సిగ్గుపడేలా నాలుగు ఏళ్ల చిన్నారి ఓ కామాంధుడి కర్కశత్వానికి బలైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం(రేగులగడ్డ)లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నాలుగేళ్ల పాపపై పైశాచికంగా లైంగిక బాలుడు(16) దాడికి పాల్పడ్డాడు. చిన్నారికి చాక్లెట్లు కొనిస్తానని ఓ ఇంటిలోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి వడిగట్టాడు. చిన్నారి అరుపులు విని స్థానికులు ఆ ఇంట్లోకి పరుగులు తీశారు. దారుణాన్ని గమనించి వెంటనే పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం అపస్మారక స్థితిలోకి పాపను హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉన్నట్టు సమాచారం. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story