- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాఖీ పండుగ పూట అన్న హత్యాయత్నం.. చెల్లెలు ఫిర్యాదు..
<p>దిశ, హాలియా: రాఖీ పండుగ రోజే ఓ చెల్లెలు అన్నపై కేసు పెట్టింది. తమ తల్లిదండ్రులు తనకంటే తన సోదరిపేరుతోనే ఎక్కువ ఆస్తిని రాసిచ్చారని, ఓ కుమారుడు తల్లి కంట్లో కారం చల్లి కొడవలితో తలపై మోదాడు. ఈ ఘటన సాక్షాత్తు రక్షాబంధన్ రోజే జరగడంతో నల్లగొండ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రక్తం పంచుకుపుట్టిన అన్నా చెల్లెళ్ల ఆస్తి తగాదాలు తల్లిని చావు అంచువరకూ తీసుకెళ్లాయి. దీంతో ఆ చెల్లెలు అన్నను కఠినంగా శిక్షించాలంటూ, పోలీస్ స్టేషన్ […]</p>

దిశ, హాలియా: రాఖీ పండుగ రోజే ఓ చెల్లెలు అన్నపై కేసు పెట్టింది. తమ తల్లిదండ్రులు తనకంటే తన సోదరిపేరుతోనే ఎక్కువ ఆస్తిని రాసిచ్చారని, ఓ కుమారుడు తల్లి కంట్లో కారం చల్లి కొడవలితో తలపై మోదాడు. ఈ ఘటన సాక్షాత్తు రక్షాబంధన్ రోజే జరగడంతో నల్లగొండ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రక్తం పంచుకుపుట్టిన అన్నా చెల్లెళ్ల ఆస్తి తగాదాలు తల్లిని చావు అంచువరకూ తీసుకెళ్లాయి. దీంతో ఆ చెల్లెలు అన్నను కఠినంగా శిక్షించాలంటూ, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండల పరిధిలోని పార్వతీపురం గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. నిడమనూరు ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇట్టె కిష్టమ్మ, కోటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె విజయలక్ష్మి లు ఉన్నారు. వృద్ధుల పేరుతో ఇరువై ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా నాలుగు ఎకరాలు వారి పేరుమీద ఉంచుకుని, మిగతా భూమిని ఇద్దరు కుమారులకు పట్టాచేసి ఇచ్చారు. వృద్ధులు వేరే ఇంట్లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు ఇట్టె సూరిబాబు కోడలు భూలక్ష్మికి అత్తామామల పేరు మీద ఉన్న భూమిపై కన్నుపడింది.
ఇదిలా ఉండగా.. విజయలక్ష్మి కూతురుని కిష్టమ్మ రెండో కుమారుడి మేనమామ వరుస ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో ఎక్కువ కిష్టమ్మ, కోటయ్యలపై ఉన్న భూ పట్టా రెండో కుమారుడికి చేశారని గత కొంత కాలంగా వృద్ధ తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నారు. 2019లో ఓ సారి తల్లి కిష్టమ్మపై దాడి చేయడంతో నిడమనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదై, కోర్టు విచారణలో ఉన్నది. ఈ క్రమంలో వారిద్దరూ ఆదివారం ఉదయం కిష్టమ్మ కళ్లలో కారం చల్లి, కొడవలితో దాడి చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి బాధితురాలిని హుటాహుటినా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమిస్తుండటంతో మిర్యాలగూడలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు సూచన మేరకు హైదరాబాద్ లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లుతున్నట్లు బంధువులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.






