కేటీఆర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం..

by Taduka Kalyani |   (  Updated:2026-07-27 11:08:26  IST  )

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు బిజేవైఎం నాయకులు యత్నించారు.

కేటీఆర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం..
X

దిశ, తంగళ్లపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు బిజేవైఎం నాయకులు యత్నించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారుల నుంచి రూ. లక్ష డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపిస్తూ బీజేవైఎం నాయకులు కేటీఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్ కు వ్యతిరేకంగా బీజేవైఎం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వాహనాలలో బీజేవైఎం నాయకులను పోలీస్ స్టేషన్ తరలించారు. ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు వసూళ్లపై కేటీఆర్ సమాధానం చెప్పాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టారు. తంగళ్లపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తూ.. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సై టు మల్లేశం తదితరులు ఉన్నారు

Next Story