ప్రకృతి వనం పేరిట భూమిని లాక్కునే ప్రయత్నం

by  |
ప్రకృతి వనం పేరిట భూమిని లాక్కునే ప్రయత్నం
X

దిశ,అందోల్:
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి పేరిట ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇదే అసరాగా చేసుకుని అధికారులు అత్యుత్సాహన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రకృతి వనం ఏర్పాటు కోసం అధికారులు నిరుపేదల భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ యువకుడు పెట్రోల్‌ పోసుకుని అత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం నాగులపల్లిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. గ్రామ శివారులో సుమారుగా 40 ఏళ్ళ క్రితం 188 సర్వేనెంబర్‌లోని 68 ఎకరాల భూమిని 61 మంది నిరుపేదలకు పట్టా సర్టిఫికేట్‌లను అందజేసింది. ఈ భూమిలోని ప్రకృతి వనానికి అవసరమైన 20 గంటల భూమిని గుర్తించి, శుక్రవారం తహశీల్దార్‌ గంగాధర్, ఎస్‌ఐ దశరథ్‎లు తమ సిబ్బందితో కలిసి చదును చేస్తుండగా, ఇదే గ్రామానికి చెందిన గంగారాం, నర్సింహులు, కిష్టయ్య, దుర్గయ్యలు అడ్డుకున్నారు. తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో ప్రకృతి వనాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని వారు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులకు, బాధితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికారుల తీరుతో విసుగు చెందిన గంగారాం అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని అత్మహత్యయత్నానికి ప్రయత్నించగా.. అక్కడున్న వారంతా అడ్డుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు తెలిపారు.


Next Story

Most Viewed