కాబూల్ ఎయిర్‌పోర్ట్ పై దాడికి యత్నం

by  |
KABUL AIRPORT
X

కాబూల్: హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో ఆప్ఘాన్ సైనికుడు మరణించాడని జర్మనీ సైనికులు వెల్లడించారు. అయితే విమానాశ్రయంలో కాల్పులు జరిపిందో, ఎవరో ఇప్పటి వరకు తెలియరాలేదు. ‘ ఉదయం సుమారు 4 -5 గంటల ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. దాంతో మేం అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపాం. కాల్పులు జరిపింది ఎవరో మాకు స్పష్టంగా తెలియరాలేదు. మా సైనికులు ఎవరు గాయపడలేదు’ అని జర్మనీ సైనికులు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.

ఈ మేరకు జర్మనీ విదేశాంగ కార్యాలయం సైతం ట్వీట్ చేసింది. ’కాబూల్‌లో పరిస్థితి చేయి దాటిపోతొంది. విమానాశ్రయ ప్రవేశ ద్వారాలు ఈ రోజు పాక్షికంగా కానీ, పూర్తిగా కాని మూసివేసి ఉంచవచ్చు. అయితే పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది’ అంటూ సమాచారమందించింది. కాగా, అమెరికా ఆగష్టు 14 నుంచి ఇప్పటి దాకా 25 వేలమందిని సొంత దేశానికి తరలించింది. మరో పదివేల మందిని తరలించడానికి ప్రణాళికలు వేస్తోంది.


Next Story

Most Viewed