దిశ, వరంగల్ తూర్పు: వరంగల్ అర్బన్ జిల్లా ఎంసీపీఐ(యూ) పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం సుమారు 6నుంచి 7గంటల మద్య ఈ ఘటన జరిగినట్లుగా ఎంసీపీఐ (యూ) వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా కార్యదర్శులు పనస ప్రసాద్, గోనె కుమారస్వామి తెలిపారు. సుమారు ఏడు గంటల ప్రాంతంలో కార్యాలయానికి వచ్చేసరికి ఆఫీసుకు సంబంధించిన ప్లెక్సీలు చింపివేశారని వారు ఆరోపించారు. తలుపులకు వేసిన తాళం పగులగొట్టి, బీరువాను ధ్వంసం చేశారని తెలిపారు. అంతటితో ఆగకుండా బీరువాలో రెండు కత్తులు అమర్చారని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు .
ఎంసీపీఐ(యు) పార్టీ కార్యాలయంపై దాడి
గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబర్ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..