గణేష్ విగ్రహాల తయారీదారులపై దాడి, చోరీలో ట్విస్ట్.. వీళ్లు మామూలోళ్లు కాదు..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-09-12 22:42:49  IST  )

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: వినాయక విగ్రహాలు అమ్ముకునే వ్యక్తి ఇంట్లో చొరబడి రూ.10 లక్షల రూపాయల ఎత్తుకెళ్లారని వచ్చిన ఫిర్యాదులో ఏ మాత్రం నిజం లేదని కరీంనగర్ టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. శనివారం అర్థరాత్రి రాజస్థాన్ కు చెందిన నవలాజి గంగారాం 20 ఏళ్లుగా జీవనోపాధి కోసం కరీంనగర్ వచ్చి, జ్యోతినగర్ లో నివాసం ఉంటున్నాడని, ఇతనికి ఆక్సిడెంట్ కావడంతో పాటు ఇతరాత్ర కారణాల వల్ల అప్పుల పాలయ్యాడని వివరించారు. ఆర్థిక [&hellip;]</p>

గణేష్ విగ్రహాల తయారీదారులపై దాడి, చోరీలో ట్విస్ట్.. వీళ్లు మామూలోళ్లు కాదు..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: వినాయక విగ్రహాలు అమ్ముకునే వ్యక్తి ఇంట్లో చొరబడి రూ.10 లక్షల రూపాయల ఎత్తుకెళ్లారని వచ్చిన ఫిర్యాదులో ఏ మాత్రం నిజం లేదని కరీంనగర్ టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. శనివారం అర్థరాత్రి రాజస్థాన్ కు చెందిన నవలాజి గంగారాం 20 ఏళ్లుగా జీవనోపాధి కోసం కరీంనగర్ వచ్చి, జ్యోతినగర్ లో నివాసం ఉంటున్నాడని, ఇతనికి ఆక్సిడెంట్ కావడంతో పాటు ఇతరాత్ర కారణాల వల్ల అప్పుల పాలయ్యాడని వివరించారు. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న గంగారంకు అప్పు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. వినాయక విగ్రహాలు అమ్మగా వచ్చిన డబ్బును చెల్లిస్తానని అప్పు ఇచ్చిన వారికి చెప్పాడన్నారు.

దీంతో ఈ నెల 11వ తేది అర్థరాత్రి కట్టు కథ అల్లి కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువా పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారని డయల్ 100కు ఫోన్ చేసి తప్పుడు ఫిర్యాదు చేశాడని ఏసీపీ తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ టూ టౌన్ సీఐ లక్ష్మిబాబు గంగారాం ఇంటికి చేరుకొని విచారణ చేశారని తెలిపారు. అయితే నవలాజి గంగారాం, అతని భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అప్పు చేసిన వారికి డబ్బులు తిరిగి చెల్లించవద్దని తప్పుడు ఫిర్యాదు చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తుల శ్రీనివాస రావు వివరించారు. ఇంట్లో ఉన్న రూ.1.80 లక్షలు వేరేచోట దాచి, బీరువాను ధ్వంసం చేసి దొంగతనం కథను అల్లి పోలీసులను తప్పు తోవ పట్టించారన్నారు.

గంగారం తన అప్పుల ఊబి నుండి బయటపడేందుకు వేసిన ఎత్తుగడలను టూ టౌన్ పోలీసులు విచారించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారన్నారు. ఈ కేసు దర్యాప్తులో వ్యూహాత్మకంగా వ్వవహరించి తప్పుడు ఫిర్యాదుగా తేల్చిన కరీంనగర్ టూ టౌన్ సీఐ లక్ష్మిబాబుతో పాటు పోలీసు సిబ్బందిని ఏసీపీ తుల శ్రీనివాసరావు అభినందించారు.

Next Story