- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై బాటిల్‌తో దాడి.. షాక్‌లో హౌస్‌మేట్స్.!
<p>దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ కంటెస్టెంట్ పై బీర్ బాటిల్‌తో దాడి జరిగిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరిక్ కీర్తి గురువారం బెంగళూరులో తన ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత వారంతా కలిసి పబ్ కు వెళ్లారు. ఆ పబ్ లో ఓ వ్యక్తి ఫొటో తీశాడు. ఇది గమనించిన కీర్తి.. ఫొటో ఎందుకు తీశావని సదరు వ్యక్తిని అడిగాడు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ కంటెస్టెంట్ పై బీర్ బాటిల్‌తో దాడి జరిగిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరిక్ కీర్తి గురువారం బెంగళూరులో తన ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత వారంతా కలిసి పబ్ కు వెళ్లారు. ఆ పబ్ లో ఓ వ్యక్తి ఫొటో తీశాడు. ఇది గమనించిన కీర్తి.. ఫొటో ఎందుకు తీశావని సదరు వ్యక్తిని అడిగాడు. అది నా ఇష్టమంటూ అతను సమాధానమిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. తీవ్ర కోపోద్రిక్తుడైన అవతలి వ్యక్తి బీర్ బాటిల్ తో కీర్తి తలపై కొట్టాడు. దీంతో అతనిపై కీర్తి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story






