- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ తగాదాలో వ్యక్తిపై దాడి.. తీవ్ర గాయాలు (వీడియో)
<p>దిశ, జగిత్యాల : జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌లో భూతగాదాలు, పాత కక్షల కారణంగా ఓ కుటుంబంపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు సెల్‌ఫోన్‌లో ఈ దృశ్యాలను చిత్రీకరించగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆరె మల్లేశం అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన గంగారెడ్డి, అతని కొడుకులు దాడికి పాల్పడ్డారు. రెండు మూడు రోజుల క్రితం గంగారెడ్డికి చెందిన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు విత్తిన వరి పంటకు గడ్డి మందు కొట్టారు. […]</p>

X
దిశ, జగిత్యాల : జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌లో భూతగాదాలు, పాత కక్షల కారణంగా ఓ కుటుంబంపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు సెల్‌ఫోన్‌లో ఈ దృశ్యాలను చిత్రీకరించగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆరె మల్లేశం అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన గంగారెడ్డి, అతని కొడుకులు దాడికి పాల్పడ్డారు.
రెండు మూడు రోజుల క్రితం గంగారెడ్డికి చెందిన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు విత్తిన వరి పంటకు గడ్డి మందు కొట్టారు. దీంతో, వరి నారు ఎండిపోయింది. అయితే, పాత కక్షలతో మల్లేశమే గడ్డి మందు పిచికారి చేశారనే అనుమానంతో ఒకరిపై ఒకరు ఈ దాడికి పూనుకున్నారు. తీవ్రంగా గాయపడిన మల్లేశంను జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






