- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కళ్లకు గంతలు కట్టేసి దళిత యువకుడిపై దాడి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: దళితుల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ దళిత యువకుడిని కళ్లకు గంతలు కట్టేసి దారుణంగా కొట్టారు యువకులు. ఈ అమానుష ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తంజావూర్ జిల్లాలో ఓ దళిత యువకుడిని కళ్లకు గంతలు కట్టి చెట్టుకు కట్టేసి కొట్టారు కొందరు యువకులు. దొంగతనం చేశాడనే అనుమానంతో యువకుడిపై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి చెందిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దళితుల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ దళిత యువకుడిని కళ్లకు గంతలు కట్టేసి దారుణంగా కొట్టారు యువకులు. ఈ అమానుష ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తంజావూర్ జిల్లాలో ఓ దళిత యువకుడిని కళ్లకు గంతలు కట్టి చెట్టుకు కట్టేసి కొట్టారు కొందరు యువకులు. దొంగతనం చేశాడనే అనుమానంతో యువకుడిపై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి చెందిన సదరు యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడిపై దాడిని దళిత సంఘాలు ఖండించాయి. దాడికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story






