చత్తీస్ గడ్‌లో కారు బీభత్సం.. భక్తుల పైనుంచి దూసుకెళ్లిన కారు(వీడియో)

by  |
చత్తీస్ గడ్‌లో కారు బీభత్సం.. భక్తుల పైనుంచి దూసుకెళ్లిన కారు(వీడియో)
X

చత్తీస్ గడ్: జష్పూర్ టౌన్ పఠల్‌గావ్‌లోని రాయగఢ్ రోడ్డు పై దుర్ఘటన దసరా వేడుకల్లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న 20 మందిపై కారు దూసుకెళ్లింది. అతివేగంగా వెళ్లడంతో పలువురికి గాయాలవ్వగా.. ఒకరి మృతి చెందారు. ప్రజలు వెంబడించి డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రులను చికిత్స కోసం పఠల్‌గావ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కారులో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది.




Next Story