ఏటీఎం మిషన్‌లో అగ్నిప్రమాదం

by Chintha Aamani |   (  Updated:2021-06-21 02:34:32  IST  )

<p>దిశ, ఆదిలాబాద్ : ఏటీఎంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోచోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. పట్టణంలోని రైల్వే గేట్ కాటన్ టవర్ పక్కనే ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం‌లో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఏసీ‌లో మంటలు చెలరేగాయి. గది సీలింగ్ పూర్తిగా కాలి బూడిద యింది. సోమవారం ఉదయం వినియోగదారులు డబ్బుల కోసం ఏటీఎం వద్దకు వెళ్లగా ఈ అగ్నిప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. [&hellip;]</p>

ATM catches fire at adilabad
X

దిశ, ఆదిలాబాద్ : ఏటీఎంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోచోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. పట్టణంలోని రైల్వే గేట్ కాటన్ టవర్ పక్కనే ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం‌లో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఏసీ‌లో మంటలు చెలరేగాయి. గది సీలింగ్ పూర్తిగా కాలి బూడిద యింది.

సోమవారం ఉదయం వినియోగదారులు డబ్బుల కోసం ఏటీఎం వద్దకు వెళ్లగా ఈ అగ్నిప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. ఏటీఎం మిషన్ కూడా కొద్దిగా దెబ్బతినడంతో అందులో కూడా మంటలు అంటుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్యాంక్ అధికారులు వచ్చి మిషన్‌ను తెరిచి చూస్తే గాని నష్టం ఎంత జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story