జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-01 09:18:19  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, అంబులెన్స్‌లో విజయవాడ జైలుకు తరలించారు. అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అవుతున్నాడన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు ప్రభుత్వాస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నాయి. మరోవైపు అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈనెల 3న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈఎస్ఐ స్కాం కేసులో అచ్చెన్నాయుడును అరెస్ట్ [&hellip;]</p>

జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, అంబులెన్స్‌లో విజయవాడ జైలుకు తరలించారు. అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అవుతున్నాడన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు ప్రభుత్వాస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నాయి. మరోవైపు అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈనెల 3న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈఎస్ఐ స్కాం కేసులో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story