భద్రాద్రి రామయ్యని దర్శించుకున్న ASP అక్షాన్స్ యాదవ్

139

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం కొత్త ఏఎస్‌పీగా బాధ్యతలు స్వీకరించిన అక్షాన్స్ యాదవ్‌ గురువారం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో శివాజీ, ఆలయ అధికారులు, పురోహితులు ఆలయ మర్యాదలతో ఏఎస్‌పీ అక్షాన్స్‌ యాదవ్‌కి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  పురోహితులు ఆయనను ఆశీర్వదించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత గురించి వివరించారు. ఏఎస్‌పీ వెంట సీఐ స్వామి, ఎస్ఐలు ఉన్నారు. ఏఎస్‌పీ అక్షాన్స్ యాదవ్ రామయ్య సన్నిధిలో కొద్దిసేపు ప్రశాంతంగా గడిపారు. ఆలయ పరిసరాలు పరిశీలించారు.