- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఏఎస్ఐ అనంతరాములు దుర్మరణం
<p>దిశ, జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ మృతి చెందిన సంఘటన శనివారం జడ్చర్లలో చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం శంకరపల్లి తండాకు చెందిన అనంత రాములు(51) నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్ డిపార్ట్మెంట్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తన విధులను ముగించుకొని తన స్వగ్రామమైన జడ్చర్ల మండలం శంకరపల్లి తండాకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ జేపీ గ్రానైట్ వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ […]</p>

దిశ, జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ మృతి చెందిన సంఘటన శనివారం జడ్చర్లలో చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం శంకరపల్లి తండాకు చెందిన అనంత రాములు(51) నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్ డిపార్ట్మెంట్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తన విధులను ముగించుకొని తన స్వగ్రామమైన జడ్చర్ల మండలం శంకరపల్లి తండాకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ జేపీ గ్రానైట్ వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఏఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరాములు కుమారుడు రాజ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల పోలీసులు తెలిపారు. అనంత రాములు మరణం పట్ల నాగర్ కర్నూల్ పోలీసులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.






