బిగ్ బ్రేకింగ్: అశ్వత్థామరెడ్డి రాజీనామా!

236

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మిక సంఘాలను రద్దు చేసినా.. టీఎంయూలో మాత్రం అధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మజ్దూరు యూనియన్​వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి పదవికి మరికాసేపట్లో రాజీనామా చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం ఎల్బీ నగర్‌లోని హిమగిరి గార్డెన్‌లో టీఎంయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం(అశ్వత్థామరెడ్డి) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్​జిల్లా రీజనల్​సెక్రెటరీ ఏఆర్​రెడ్డికి బాధ్యతలను అప్పగించనున్నారు. రాజీనామ తర్వాత ప్రజా క్షేత్రంలో ఉంటానని అశ్వత్థామరెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.

కాగా టీఎంయూలో మరో వర్గం, వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్న థామస్​రెడ్డి శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో టీఎంయూ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే థామస్​రెడ్డి ప్రధాన కార్యదర్శిగా కార్యవర్గాన్ని ఎన్నుకుని, ఎమ్మెల్సీ కవితను గౌరవాధ్యక్షురాలిగా తీర్మానం చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ పంపించారు. కానీ టీఎంయూలో రెండు వర్గాల పోరు సాగుతున్న నేపథ్యంలో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నేడు అశ్వత్థామరెడ్డి రాజీనామా తర్వాత శుక్రవారం థామస్​రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి నూతన కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా ఆర్టీసీ జేఏసీలో… సమ్మె కాలంలో కీలకంగా వ్యవహరించి అశ్వత్థామరెడ్డి టీఎంయూకు రాజీనామా చేయడం కొంత చర్చగా మారింది. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.

ఆ తల్లి గోస.. స్పందించిన తెలంగాణ పోలీస్ బాస్ క్లిక్ చేయండి

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..