- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెలబ్రిటీలు.. మీ ఓవరాక్షన్ తగ్గించండి : ఆశా నేగి
<p>దిశ, సినిమా : వ్యాక్సిన్ తీసుకుంటూ ఫొటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా సినిమా స్టార్స్ ఇలాంటి ఫొటోలు షేర్ చేస్తూ.. డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్షన్స్ ఇస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల్లో కూడా ఈ ఫొటోలు దిగడం ఏంటి? అనే క్వశ్చన్ అందరి మైండ్‌లోనూ తలెత్తడంతో పాటు కోపం కూడా వస్తోంది. View this post on Instagram A post shared by MsNegi (@ashanegi) […]</p>

దిశ, సినిమా : వ్యాక్సిన్ తీసుకుంటూ ఫొటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా సినిమా స్టార్స్ ఇలాంటి ఫొటోలు షేర్ చేస్తూ.. డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్షన్స్ ఇస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల్లో కూడా ఈ ఫొటోలు దిగడం ఏంటి? అనే క్వశ్చన్ అందరి మైండ్‌లోనూ తలెత్తడంతో పాటు కోపం కూడా వస్తోంది.
ఈ క్రమంలోనే టీవీ స్టార్ ఆశా నేగి సెలబ్రిటీల ఓవరాక్షన్‌పై ఫైర్ అయింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేసి ఓవర్ యాక్టింగ్ చేయొద్దని సూచించింది. అవగాహన కోసం అయితే ఓకే కానీ, ఈ విషయం చాలా కోపం తెప్పిస్తుందని మండిపడింది. ఈ ఫొటోలు తీసేందుకు వీడియోగ్రాఫర్‌లను మీరే నియమించుకుంటారా లేక ఆస్పత్రి వాళ్లు ఇందుకోసం ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్స్‌ను కేటాయిస్తారా? అని జనాలు అడుగుతున్నారన్న నటి.. షేమ్‌ఫుల్‌గా అనిపించడం లేదా? అని ప్రశ్నించింది.






