చంచల్ గూడ జైలుపై ట్విట్టర్‌లో ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |   (  Updated:2021-06-12 08:33:18  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్ సెంట్రల్ జైలును తరలించినట్లే చంచల్ గూడ జైలును కూడా మరోచోటుకి తరలించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వరంగల్ జైలును తరలించి ఆ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు పూనుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. Must appreciate @TelanganaCMO’s decision to shift Warangal Central Jail &amp; to use its land to set up a Super [&hellip;]</p>

Asaduddin owaisi interesting comments on Chanchalguda jail
X

దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్ సెంట్రల్ జైలును తరలించినట్లే చంచల్ గూడ జైలును కూడా మరోచోటుకి తరలించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వరంగల్ జైలును తరలించి ఆ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు పూనుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.

చంచల్ గూడ జైలును కూడా అలాగే మరోచోటుకు తరలించి జైలుకు చెందిన 45 ఎకరాల భూమిలో ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్లు లేదా హార్డ్‌వేర్ పార్క్ వంటివి ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడేలా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story