కరోనా సోకిన మహిళల్లో అధిక ఇమ్యూనిటీ..

by  |
కరోనా సోకిన మహిళల్లో అధిక ఇమ్యూనిటీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరూ కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో కరోనా లక్షణాలు లేకున్నా కొందరికి టెస్టులు నిర్వహిస్తే పాజిటివ్ అని వస్తోంది. మరికొందరికీ కరోనా వచ్చిన విషయం తెలియకున్నా.. వారి శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో తేలింది.

ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన టెస్టుల్లో మరొక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా సోకిన మహిళల్లో మగవారి కంటే అధికంగా రోగనిరోధక శక్తి ప్రతిస్పందన వెలువడుతోందని తేలింది. దీనికి కారణం టీ-సెల్స్ అని ధృవీకరించారు. ఈ సెల్స్ ద్వారా మరింత ధృడమైన, నిరంతర రోగనిరోధక ప్రతిస్పందన విడుదలవుతోందని వైద్యులు కనుగొన్నారు. దీనిని కరోనా పాజిటివ్ వ్యక్తుల చికిత్సకు.. సెక్స్ ఆధారిత విధానాన్ని మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed