తెలుగు, తమిళంలో ‘ఆర్టికల్ 15’?

by  |
తెలుగు, తమిళంలో ‘ఆర్టికల్ 15’?
X

నిజ జీవిత సంఘటనల ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమా ‘ఆర్టికల్ 15’. వినూత్న కథలను ఎంచుకునే ఆయుష్మాన్ ఖురాన ఇందులో హీరోగా నటించాడు. సామాజిక చిత్రాల దర్శకుడు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతుండటం విశేషం.

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో సినిమా హిట్టయినా సరే.. వెంటనే ఆ సినిమాపై ఇతర ఇండస్ట్రీ మేకర్స్ దృష్టి సారిస్తున్నారు. ఆ సినిమాల రీమేక్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. వెంకటేష్ హీరోగా చేస్తున్న నారప్ప, చిరంజీవి తదుపరి చేయబోయే ‘లూసిఫర్’, ఇటీవలే వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, 36 వయసులో.. ఇవన్నీ కూడా రీమేక్ చిత్రాలే. అదేవిధంగా మన తెలుగు చిత్రాలు బాలీవుడ్‌లోనూ భారీగానే రీమేక్ అవుతున్నాయి. అక్షయ్ లక్ష్మీబాంబ్, షాహిద్ కపూర్ ‘జెర్సీ ’ ఇలా చెప్పుకుంటే ఆ జాబితా పెద్దదే అవుతుంది. అయితే బాలీవుడ్‌లో డీసెంట్ హిట్టు కొట్టిన ‘ఆర్టికల్ 15’ మీద సౌత్ నిర్మాతల కన్నుపడింది. ఆ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏకకాలంలో రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ్ వెర్షన్‌లో స్టార్ హీరో ధనుష్ నటించబోతున్నట్లుగా తెలుస్తుండగా, తెలుగులో అడవి శేషు లీడ్ రోల్ పోషించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఆయనకు వీలు కాకపోతే.. సత్యదేవ్‌‌ను ఆల్టర్నేట్‌గా ఎంచుకోనున్నట్లు సమాచారం. కాగా త్వరలోనే దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.



Next Story

Most Viewed