Bollywood News: మాయావతిపై సెక్సిస్ట్ కామెంట్స్.. హీరో అరెస్ట్‌కు డిమాండ్

by  |
Arrest Randeep Hooda- On Trend
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడాను అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. యూపీ మాజీ చీఫ్ మినిస్టర్ మాయావతిపై లింగవివక్ష, కులవాద జోక్‌లు వేయడంపై ఫైర్ అవుతున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ఓ మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో దళిత మహిళ గురించి అనవసర కామెంట్స్ చేస్తూ నవ్వుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అయిన రణ్‌దీప్ ఇలాంటి కామెంట్స్ చేయడం సిగ్గుచేటని, అణగారిన వర్గాల గురించి ఇంత చీప్‌గా మాట్లాడటం అసలు బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. ‘#ArrestRandeepHooda’ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

https://twitter.com/SrishtyRanjan/status/1397147896152166404?s=20


Next Story