నౌకను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు

by  |
నౌకను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ తెన్నేటి పార్క్‌ సముద్ర తీరానికి బంగ్లాదేశ్‌‌కు చెందిన మర్చంట్ వెసల్ నౌక కొట్టుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ నౌకను తిరిగి సముద్రంలోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రైవేట్‌ ఏజెన్సీలకు టెండర్లను పిలిచారు. నౌకలో 40 టన్నుల ఇంధనం ఉంది. ఆ ఇంధనాన్ని బయటికి తీసిన తర్వాత నౌకను సముద్రంలోకి పంపనున్నారు. రివర్స్ పంపింగ్ విధానం ద్వారా సముద్రంలోకి నౌకను తీసుకెళ్లేందుకు లోకల్ ఏజెంటు, పీఐ క్లబ్‌, డీజీ షిప్పింగ్‌, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, కలెక్టర్‌, సెక్యూరిటీ గార్డులతో నౌక యజమాని సమన్వయం కుదుర్చుకున్నారు.


Next Story

Most Viewed