ఇటు చూడు డయానా.. నీతో పడుకునేందుకు నీ ప్రియుడు ఎలా వచ్చాడో

166

దిశ,వెబ్‌డెస్క్: వాళ్లిద్దరూ ప్రేమికులు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కలలుగన్నారు. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరిగిపోతే అది జీవితం ఎందుకవుతుంది. కట్ చేస్తే సీన్ మారింది. ప్రియురాలు మరొకరి సొంతం అయ్యింది. అయినా ప్రియుడు..,ప్రియురాలిని మరిచిపోలేకపోయాడు. భర్త లేని సమయంలో ప్రియురాలు సైతం ప్రియుడితో గడిపేందుకు ఇష్టపడేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు ఆర్మీలో పనిచేస్తున్న భర్తకు.., భార్యపై అనుమానం వచ్చింది. తాను ఇంట్లో లేనప్పుడు ఎవరో ఇంటికి వస్తున్నారని, భార్య తనని మోసం చేస్తుందని ఆందోళనకు గురయ్యాడు.

ప్రియుడు జార్జ్, ప్రియురాలు డయానా’లు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ డయానాను జార్జ్ తో పెళ్లి జరిపించడం ఆమె కుటుంబసభ్యులకు అస్సలు ఇష్టంలేదు. అందుకే డయానాను ఆర్మీలో పనిచేస్తున్న స్టీఫెన్కు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. రోజులు గడుస్తున్నాయి కానీ ప్రియుడు జార్జ్ ప్రియురాలు డయానాను మరిచిపోలేకపోతున్నాడు. ప్రియురాలు డయానా సైతం జార్జ్ ను మరిచిపోలేకపోతుంది. దీంతో భర్త స్టీఫెన్ ఇంట్లో లేని సమయంలో ప్రియుడు జార్జ్.., ప్రియురాలు డయానా ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. అయితే ఓ రోజు జార్జ్ ఇంటికి రావడం స్టీఫెన్ గమనించాడు. అదే సమయంలో భార్య డయానా గర్భవతి కావడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతో ఆర్మీ కోర్ట్ ను ఆశ్రయించాడు. దీంతో ఆర్మీ కోర్ట్ విచారణకు ఆదేశించించింది.

 ఆర్మీ కోర్ట్ లో కేసు విచారణ మరో రెండు గంటల్లో జరగాల్సి ఉంది. విచారణకు ప్రియుడు జార్జ్, భర్త స్టీఫెన్ హాజరయ్యాడు. గర్భవతిగా ఉన్న ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. ఈ సందర్భంగా స్టీఫెన్ కుట్రప్రకారం తన వెంట తెచ్చుకున్న పొడవైన కత్తితో ప్రియుడు జార్జ్ ను శిరచ్ఛేదనం చేశాడు. అనంతరం జార్జ్ తలతో భార్య డయాను ఉంటున్న ఆస్పత్రి వార్డ్ కు వెళ్లాడు. ఆస్పత్రి బెడ్ పై రెస్ట్ తీసుకుంటున్న డయానాకు.. ప్రియుడు జార్జ్ తలను చూపిస్తూ …, డయానా చూడు. ఈరోజు నుంచి నిద్ర నువ్వొక్కదానివే కాదూ నీతో పాటు పడుకునేందుకు నీ ప్రియుడు జార్జ్ కూడా వచ్చాడు’ అంటూ అక్కడి నుంచి విజయ గర్వంతో ఆర్మీ కోర్ట్ విచారణకు హాజరయ్యాడు. విచారణ సందర్భంగా ప్రియుడు జార్జ్ ను హత్య చేసినట్లు భర్త స్టీఫెన్ అంగీకరించాడు. కానీ జార్జ్ ను ప్లాన్ ప్రకారం హత్య చేసింది కాదని, ప్రతీకారంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..