- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్జున్ లేని లోకంలో ఉండలేను : అన్షులా కపూర్
<p>బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌కు సోదరి అన్షులా కపూర్.. బెస్ట్ బర్త్‌డే విషెస్ అందించింది. అర్జున్‌ను తన హార్ట్ బీట్‌గా అభివర్ణించిన అన్షులా.. తనను తల్లి ఇచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రేమకు హద్దులు తెలియని వ్యక్తి.. ఉదయాన్నే మేల్కొనేందుకు కారణమైన శక్తి తను. తల్లిదండ్రులు, స్నేహితుడు, సోదరుడు, నమ్మకస్తుడు.. ఇలా అన్ని పాత్రలు తనవే’ అని చెప్పింది. పడిపోకముందే పట్టుకునేందుకు రెడీగా ఉండే అర్జున్ కపూర్.. ప్రతీ సమస్యలోనూ తోడుగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. View […]</p>

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌కు సోదరి అన్షులా కపూర్.. బెస్ట్ బర్త్‌డే విషెస్ అందించింది. అర్జున్‌ను తన హార్ట్ బీట్‌గా అభివర్ణించిన అన్షులా.. తనను తల్లి ఇచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రేమకు హద్దులు తెలియని వ్యక్తి.. ఉదయాన్నే మేల్కొనేందుకు కారణమైన శక్తి తను. తల్లిదండ్రులు, స్నేహితుడు, సోదరుడు, నమ్మకస్తుడు.. ఇలా అన్ని పాత్రలు తనవే’ అని చెప్పింది. పడిపోకముందే పట్టుకునేందుకు రెడీగా ఉండే అర్జున్ కపూర్.. ప్రతీ సమస్యలోనూ తోడుగా ఉన్నాడని చెప్పుకొచ్చింది.
View this post on InstagramA post shared by Anshula Kapoor (@anshulakapoor) on
‘అర్జున్ అమ్మను మరిచిపోనివ్వడు.. అలాగని తను లేదనే బాధ కలగనివ్వడు. తను కోరుకున్న దానికంటే.. అర్హత ఉన్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు.. నక్షత్రాల కింద ఉన్న ప్రతీది అందించాడు’ అని తెలిపింది. తన భయాలు, ఆలోచనలు, శత్రువులు తెలిసిన అర్జున్.. ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడని.. తన నంబర్ వన్ హీరో అర్జున్ అని వెల్లడించింది. అర్జున్ లేని లోకంలో తను ఉండలేనన్న అన్షులా.. అప్పటి వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అన్నయ్య అంటూ.. అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.






