బ్రెయిన్‌లెస్ ఫిల్మ్ చేశానంటున్న హీరో అర్జున్

by  |
arjun-kapoor 1
X

దిశ, సినిమా : తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఏక్ విలన్ రిటర్న్స్’ గురించి మాట్లాడిన బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్.. దీన్ని ‘బ్రెయిన్‌లెస్ లేదా పనికిరాని’ చిత్రంగా పోల్చాడు. అయితే సినిమా సక్సెస్‌పై తనకు పూర్తి నమ్మకముందని, అందుకే రిలీజ్ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. రీసెంట్‌గా రిలీజైన ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ మూవీలో పరిణీతి చోప్రాకు జంటగా నటించిన అర్జున్.. ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’లో రకుల్‌కు కోస్టార్‌గా కనిపించాడు.

ఇక ‘ఏక్ విలన్ 2’లో జాన్ అబ్రహం, తార సుతారియాతో పాటు దిశా పటానీ నటిస్తుండగా.. తెరపై డైరెక్టర్ మోహిత్ సూరి మ్యాజిక్ చేశాడని చెప్పాడు. అయితే ఇది మెయిన్‌స్ట్రీమ్ ఫిల్మ్ కాదని, బ్రెయిన్‌లెస్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చాడు. మంచి కథ, పాత్రలు, ట్విస్టులతో పాటు ఊహించని మలుపులు ఈ చిత్రంలో ఉంటాయని.. వీటిని సిల్వర్ స్క్రీన్‌పై ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నానని పేర్కొన్నాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed