మాల్దీవుల్లో వరుణ్, నటాషా హాలిడే ట్రిప్..?

by  |
మాల్దీవుల్లో వరుణ్, నటాషా హాలిడే ట్రిప్..?
X

దిశ, సినిమా : యంగ్ హీరో వరుణ్ ధావన్ తన భార్య నటాషా దళాల్‌తో కలిసి విదేశాల్లో విహరిస్తున్నాడు. తాజాగా సముద్రం పక్కన బ్లాక్ కలర్ బికినీలో ఉన్న నటాషాను హత్తుకుని నిలుచున్న ఫొటోను ఆన్ లైన్‌లో పంచుకోగా.. ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ మాల్దీవుల్లో ఉన్నారా? అంటూ ఆశ్చర్యపోతూ కామెంట్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన వరుణ్ ఉదయం ఓట్స్ బౌల్‌లో పాలు పోసిన ఫొటోను షేర్ చేసి, ‘నాట్ ఇన్ మాల్దీవ్స్’ అని స్మైలీ రియాక్షన్ ఇచ్చాడు. దీంతో తమ అభిమాన కపుల్స్ వరుణ్-నటాషా ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.

అయితే ఇటీవల సారా అలీ‌ఖాన్, అనన్య పాండేతో కలిసి మాల్దీవులకు వెళ్లిన కపుల్స్.. ఉష్ణమండల ప్రాంతంలో ఎంజాయ్ చేస్తున్నట్టు కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా ఈ పిక్స్ చూసిన అనిల్ కపూర్, మౌనీ రాయ్, ఈషా గుప్తాతో పాటు ఇతర సెలబ్రిటీలు ఈ కపుల్స్‌ ప్రేమను చూసి అభినందిచారు. ఇక చివరిసారిగా కూలీ నంబర్ 1లో సారా అలీ ఖాన్‌తో కనిపించిన వరుణ్.. తాజాగా కియారా అద్వానీ, నీతూ కపూర్, అనిల్ కపూర్‌తో కలిసి ‘జగ్ జగ్ జీయో’లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి రాజ్ మెహతా దర్శకత్వం వహించగా.. కరణ్ జోహార్ నిర్మించారు.


Next Story

Most Viewed