- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆర్చర్ ఐపీఎల్ ఆడే అవకాశం ఉంది’
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా టీ-20 చివరి మ్యాచ్‌లో ఇంగ్లాంగ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మోచేతికి గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రేపటి నుంచి జరగబోయే వన్డే మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ప్రస్తుతం ఆ జట్టు మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. ఇదే విషయంపై కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్లారిటీ ఇచ్చాడు. “నిజం చెప్పాలంటే, నేను వైద్య అభిప్రాయం ఇవ్వలేను. అతని మోచేయి పరిస్థితి మాకు తెలుసు, అది […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా టీ-20 చివరి మ్యాచ్‌లో ఇంగ్లాంగ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మోచేతికి గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రేపటి నుంచి జరగబోయే వన్డే మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ప్రస్తుతం ఆ జట్టు మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. ఇదే విషయంపై కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్లారిటీ ఇచ్చాడు. “నిజం చెప్పాలంటే, నేను వైద్య అభిప్రాయం ఇవ్వలేను. అతని మోచేయి పరిస్థితి మాకు తెలుసు, అది క్రమంగా అధ్వాన్నంగా మారింది. దీనికి వైద్య పరిశీలన అవసరం.. అతడు త్వరగా కోలుకోవడానికి కూడా శ్రద్ధ చూపిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో వన్డే మ్యాచులకు అతడు దూరం అయ్యాడని గుర్తు చేస్తూనే.. వైద్యుల చికిత్సలో జోఫ్రా కోలుకుంటే.. వారి అనుమతితోనే ఐపీఎల్‌లో ఏదో ఒక దశలో ఆడుతాడని చెప్పుకొచ్చాడు.
Next Story






