- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దబాంగ్ డైరెక్టర్‌పై సల్మాన్ లీగల్ యాక్షన్..
<p>దబాంగ్ సినిమా డైరెక్టర్ అభినవ్ కశ్యప్.. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీపై పలు ఆరోపణలు చేశారు. తనను అణగదొక్కాలని ట్రై చేశారని.. వేరే నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుంటే చెడగొట్టారని ఆరోపించారు. ఇక ‘బీయింగ్ సల్మాన్ ఖాన్’ పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా నామ్‌కే వాస్త్ జరిగినా.. మీడియా మాత్రం చాలా గొప్పగా ప్రచారం చేస్తుందన్నారు. ఐదు సైకిళ్ల పంపిణీ జరిగితే 5000 సైకిళ్లను పంపిణీ చేశారని మీడియాలో కథనాలు వస్తాయని చెప్పాడు అభినవ్. […]</p>

దబాంగ్ సినిమా డైరెక్టర్ అభినవ్ కశ్యప్.. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీపై పలు ఆరోపణలు చేశారు. తనను అణగదొక్కాలని ట్రై చేశారని.. వేరే నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుంటే చెడగొట్టారని ఆరోపించారు. ఇక ‘బీయింగ్ సల్మాన్ ఖాన్’ పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా నామ్‌కే వాస్త్ జరిగినా.. మీడియా మాత్రం చాలా గొప్పగా ప్రచారం చేస్తుందన్నారు. ఐదు సైకిళ్ల పంపిణీ జరిగితే 5000 సైకిళ్లను పంపిణీ చేశారని మీడియాలో కథనాలు వస్తాయని చెప్పాడు అభినవ్. చారిటీని దుర్వినియోగం చేస్తున్నారని పలు ఆరోపణలు చేశాడు.
కాగా దీనిపై స్పందించిన సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్.. లీగల్ యాక్షన్ తీసుకునేందుకు తమ ఫ్యామిలీ డిసైడ్ అయిందని తెలిపాడు. ఫిల్మ్ అసోసియేషన్‌లోనూ ఫిర్యాదు చేస్తామని, దీనిపై ఇదే పద్ధతిలో ఫైట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అసలు నిజాలు బయటపడతాయని వెల్లడించారు.






