నిజజీవితం నుంచి డిజిటల్‌కి… కట్, కాపీ, పేస్ట్

by  |
నిజజీవితం నుంచి డిజిటల్‌కి… కట్, కాపీ, పేస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్:
ఇప్పటివరకు ఆగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)లో నిజజీవిత ప్రదేశాల్లో డిజిటల్ చిత్రాలను ప్రొజెక్ట్ చేయగలిగాం. కానీ ఇక నుంచి నిజజీవిత వస్తువులను 3డీ చిత్రాలుగా మార్చి డిజిటల్ డాక్యుమెంట్లలో పొందుపరుచుకునే టూల్ వచ్చేసింది. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్‌లో డెవలపర్‌గా పనిచేస్తున్న సిరిల్ డయాన్యే ఈ కొత్త ఏఆర్ టూల్‌ని అభివృద్ధి చేశారు.

ఈ టూల్ సాయంతో నిజజీవిత వస్తువులను డిజిటల్ డాక్యుమెంట్లలోకి ఎలా కట్, కాపీ, పేస్ట్ చేయాలో డయాన్యే తన ట్విట్టర్ ఖాతాలో వీడియో ద్వారా చూపించారు. డిజైనర్లు ఇప్పటివరకు వస్తువును కెమెరాతో ఫొటో తీసి, వేరే సాఫ్ట్‌వేర్ సాయంతో దాన్ని కావాల్సినట్లుగా ఎడిట్ చేసి డిజిటల్‌గా ఉపయోగించుకునేవారు. ఇక ఈ టూల్ సాయంతో డైరెక్టుగా పేస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రోటోటైప్ దశలో ఉన్న ఈ టూల్‌ని మరింత మెరుగుపరచడానికి సాయం కావాలంటూ డయాన్యే తన కోడ్ మొత్తాన్ని గిట్‌హబ్‌లో పెట్టినట్లు పేర్కొన్నాడు.

Tags: AR tool, real world to digital, digital, arts and culture, digital, augumentation, reality



Next Story