కొంటెగాన్ని కట్టుకో… అంటున్న కెవిన్ పీటర్సన్

by  |
కొంటెగాన్ని కట్టుకో… అంటున్న కెవిన్ పీటర్సన్
X

కరోనా విజృంభణ తో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయింది. ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఇంటి పట్టునే సురక్షితంగా ఉండాలని దేశాలన్నీ నిబంధనలు విధించాయి. సినిమాల షూటింగ్, రిలీజ్ లు వాయిదా పడ్డాయి. సినిమా హాళ్లు, మాల్స్ మూత పడ్డాయి. అటు క్రికెట్ మ్యాచ్ లు కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ఇంట్లోనే ఉంటున్న క్రికెటర్లు తమలో దాగిన మరో కళను ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం సౌత్ ఇండియా మ్యూజిక్ ను ఎంచుకున్నారు.

ఈ క్రమంలోనే క్రికెటర్ డేవిడ్ వార్నర్ .. బుట్ట బొమ్మ సాంగ్ తో సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేసి.. రాములో రాములా సాంగ్ పై స్టెప్పులతో దుమ్ముదులిపేశాడు. ఇక పోకిరి డైలాగ్ తో డైరెక్టర్ పూరి మనసు దోచిన వార్నర్.. త్వరలో ఆయన సినిమాలో అతిథి పాత్ర చేసే అవకాశాన్నీ కొట్టేశాడు. ఈ విషయాన్ని పూరి స్వయంగా వెల్లడించాడు కూడా.

ఇప్పుడు ఇదే దారిలో వెళ్తున్నాడు క్రికెటర్ కెవిన్ పీటర్సన్. ఇంతకు ముందు బుట్టబొమ్మ సాంగ్ పై స్టెప్స్ వేసిన పీటర్సన్… ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో అర్జున్ హీరోగా వచ్చిన జెంటిల్ మెన్ సినిమాలోని కొంటెగాన్ని కట్టుకో పాటకు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో నెటిజన్లతో పాటు ఆ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ను ఫిదా చేశాడు. ఏకంగా ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రమ్ అకౌంట్ లో షేర్ చేశాడు రెహమాన్.

@kevinpietersen🕺 ##houseoftiktok 🤣

♬ OTTAGATHAI KHATIKHO – SAMIER

Next Story

Most Viewed